Wednesday, February 25, 2026
E-PAPER
Homeఆటలుసూప‌ర్-8లో ఆతిథ్య‌ జ‌ట్లు పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న‌

సూప‌ర్-8లో ఆతిథ్య‌ జ‌ట్లు పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: టీ20 వ‌ర‌ల్డ్‌ క‌ప్‌లో ఆతిథ్య జ‌ట్లులైనా శ్రీ‌లంక, భార‌త్ అంచనాలు త‌ల‌క్రిందులైయ్యాయా. లీగ్ ద‌శ‌లో అప‌జ‌యం లేకుండా జోరుమీదున్న‌ ఇరు జ‌ట్లు అస‌లు స‌మ‌రంలో వెన‌క‌బ‌డిపోయ్యాయా. టైటిల్ ఫెవ‌రేట్ జ‌ట్లుగా బ‌రిలోకి దిగిన టీంలు టోర్నీ నుంచే నిష్క‌మించే ద‌శ‌కు చేరుకున్నాయా..అందుకు అవున‌నే సంకేతాలు అందుతున్నాయి. ప్ర‌స్తుతం సూప‌ర్-8 ద‌శ‌లో శ్రీ‌లంక, టీమిండియా పాయింట్ల ప‌ట్టిక‌లో చివ‌రి స్థానంలో ఉన్నాయి.

ఈ ఏడాది భార‌త్, శ్రీ‌లంక దేశాలు సంయుక్తంగా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ మెగా టోర్నీకి ఆతిథ్య‌మిచ్చాయి. ఈ సారి టోర్న‌మెంట్‌లో మొత్తం 20 జ‌ట్లు పాల్గొన‌గా 8 జ‌ట్లు సూప‌ర్-8కు చేరుకున్నాయి. అయితే గ్రూప్ లీగ్ ద‌శ‌లో ఇండియా, శ్రీ‌లంక ఆట‌తీరు ఆమోగం. గ్రూప్‌-ఏలో భార‌త్ ఆడినా ప్ర‌తి మ్యాచ్‌లోనూ విజ‌యం సాధించి సూప‌ర్-8కు చేరుకుంది. పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలో నిలిచి ముంద‌స్తుగానే సూప‌ర్-8 బెర్తుఖాయం చేసుకొని టైటిల్ ఫేవ‌రేట్ జ‌ట్టుగా నిరూపించుకుంది. హిస్ట‌రీ డిపిట్(Defeat) చేసి చ‌రిత్రను క్రియేటివ్ చేస్తుంద‌ని టోర్నీ ప్రారంభం కాముందే టీవీల్లో, సోష‌ల్ మీడియా వేదిక‌గా ఢంకా బ‌నాయించింది. కానీ సూప‌ర్-8 మ్యాచ్‌లు ప్రారంభంకాగానే టీమిండియా అంచ‌నాలు త‌ల‌క్రిందులైయ్యాయి.

ద‌క్షిణాఫ్రికా చేతిలో ఘోర ప‌రాజ‌యం ముట్ట‌గట్టుకుంది. బాల్‌తో బౌల‌ర్లు రాణింణిచినా..బ్యాట‌ర్లు టార్గ‌ట్‌ను ఛేదించ‌లేక చేతులేత్తాశారు. 42 ప‌రుగుల‌తో శివందూబే ఒంట‌రీ పోరాటం సాగించినా..ల‌క్ష్యం అంత‌రం త‌గ్గ‌లేదు. దీంతో భార‌త్ సెమీఫైన‌ల్ ఆశ‌లు స‌న్న‌గిల్లాయి. టోర్నీలో ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సినా..త‌ప్ప‌క గెలువాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. గురువారం జింబాబ్వే జ‌ట్టుతో త‌ల‌ప‌డ‌నుంది. అయితే ఆస్ట్రేలియాను టోర్నీ నుంచి ఇంటికి పంపినా ఘ‌న చ‌రిత్ర జింబాబ్వే సొంతం. వెస్టిండిస్‌తో ఆడిన సూప‌ర్-8 మ్యాచ్‌లో 250 ప‌రుగుల కొండంత ల‌క్ష్యానికి బెద‌ర‌కుండా 145 ప‌రుగులు చేసి ఆలౌటైంది. ఈ ప‌రిస్థితుల నేప‌థ్యంలో జింబాబ్వే జ‌ట్టును త‌క్కువ అంచ‌నా వేయ‌లేని ప‌రిస్థితి. స‌రైనా వ్యూహాంతో సూర్య‌సేన మ్యాచ్‌కు సిద్ధంకాక‌పోతే చ‌రిత్ర‌లో ఆప‌కీర్తి ముట్ట‌గ‌ట్టుకోనుంది.

అదే విధంగా సూప‌ర్‌-8 మ్యాచ్‌లో భాగంగా మార్చి 1న‌ వెస్టిండిస్‌తో సూర్య‌సేన త‌ల‌ప‌డ‌నుంది. ఈ మెగా టోర్నీలో వెస్టిండీస్ భీక‌ర ఫామ్‌లో ఉంది. జింబాబ్వేతో జ‌రిగిన మ్యాచ్‌లో టోర్నీలో అత్య‌ధిక ప‌రుగుల(259) రికార్డును న‌మోదు చేసింది. ఒక‌వేళ జింబాబ్వేపై గెలిచినా..వెస్టిండీస్‌ను ఢీకొన‌డ‌మంటే భార‌త్‌కు క‌త్తి మీద‌ స‌వాలే..అందుకు ప్ర‌స్తుత టోర్నీ గ‌ణాంకాలే ఉదాహ‌ర‌ణ‌. డిఫెండింగ్ చాంపియ‌న్ అనే హోదా, ఆసియా క‌ప్ గెలిచినా దీమా భార‌త్‌కు ఉన్నా..గ్రూప్ ద‌శ నుంచి ఇప్ప‌టి సూప‌ర్‌-8 వర‌కు వెస్టిండీస్ ఓట‌మి అన్న‌దే ఎరుగ‌దు. దీంతో సూర్య‌సేన స‌మిష్టిగా రాణిస్తేనే వెస్టిండీస్‌ను ఓడించి సెమీస్‌కు వెళ్ల‌నుంది.

మ‌రో ఆతిథ్య జ‌ట్టైనా శ్రీ‌లంక సెమీ ఆశ‌లు కూడా సంక‌ట‌స్థితిలో ప‌డ్డాయి. గ్రూప్ ద‌శ‌లో వ‌రుస విజ‌యాల‌తో జోరుమీదున్న లంకేయుల‌కు జింబాబ్వే బ్రేక్ వేసింది. గ్రూప్ లీగ్ చివ‌రి మ్యాచ్‌లో శ్రీ‌లంక‌ను ఓడించి జింబాబ్వే సూప‌ర్‌-8కు చేరుకొని సంచ‌లనం న‌మోదు చేసింది. మెగా టోర్నీలో ప్ర‌స్తుతం శ్రీ‌లంక టైటిల్ ఫేవ‌రేట్ టీంగా బ‌రిలోకి దిగినా సూప‌ర్‌-8లో పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆ దేశ వాసుల‌ను నిరాశ‌ప‌రుస్తోంది. సూప‌ర్-8 తొలి పోరులో ఇంగ్లాండ్‌పై ఓడిపోయింది. దీంతో పాయింట్ల ప‌ట్టిక‌లో చివ‌రి స్థానానికి ప‌డిపోయింది శ్రీ‌లంక‌… నేడు న్యూజిలాండ్‌తో కీల‌క మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌లో శ్రీ‌లంక ఓడిపోతే..టైటిల్ ఏమో కానీ..సెమీ ఆశ‌లే గ‌ల్లంతు అయ్యే అవ‌కాశాలున్నాయి.

కీవీస్ త‌న సూప‌ర్-8 తొలి పోరు(పాకిస్థాన్) వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దుగా కాగా..ఇవాళ జ‌రిగే మ్యాచ్‌లో విక్ట‌రీ సాధించి సెమీస్ ఆశ‌లు నిలుపుకోవాల‌ని చూస్తోంది. ఏది ఏమైనా ఇరుజ‌ట్లు ఉత్త‌మ ప్ర‌తిభ‌ను క‌న‌బ‌ర్చి టైటిల్ కైవ‌సం చేసుకోవాల‌ని ఇరు దేశాల అభిమానులు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. సొంత‌గ‌డ్డ‌పై జ‌రుగుతున్న మెగా టోర్నీలో ఆతిథ్య జ‌ట్లు టైటిల్ కోసం తుది పోరులో త‌ల‌ప‌డాల‌ని ఆశిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -