హమాలి వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నాయకులు తిరుపతి రామ్మూర్తి
నవతెలంగాణ – మిర్యాలగూడ
హమాలి వర్కర్లు హక్కుల కోసం పోరాడాలని హమాలి వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తిరుపతి రామ్మూర్తి కోరారు. శనివారం స్థానిక రైల్వే స్టేషన్లో రైల్వే హమాలి వర్కర్స్ యూనియన్ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైల్వే హమాలి వర్కర్లు ఐక్యంగా ఉండి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేయాలన్నారు. రైల్వే హమాలీలకు కనీస వతనాలు అమలు ఏ విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈఎస్ఐ,పీఎఫ్ అందరికి వర్తింపజేయాలన్నారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు అధ్యక్షులుగా నంద్యాల వేణుధర్రెడ్డి, ఉపాధ్యక్షులుగా భాగ్య నాయక్, హుస్సేన్, డి.బాలు, ప్రధాన కార్యదర్శిగా బి. రెడ్యా నాయక్, సహాయ కార్యదర్శులుగా నాట్య నాయక్, పీవీ రమణ, పి.సైదులు కోశాధికారిగా జీ.బధ్య నాయక్, మరో పది మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు.
హమాలి వర్కర్లు హక్కుల కోసం పోరాడాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



