- Advertisement -
నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని లక్నావారం పంచా యితీ తాతయ్య పల్లి గ్రామంలో శుక్రవారం పోషణ మాస మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో టీచర్ సుమతీ రాణి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు పిల్లలకు తల్లులకు పౌష్టికాహారం పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మహిళలు గర్భిణీలు పిల్లలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రక్తహీనతకు తావు లేకుండా పెరుగుదలకు లోపం లేకుండా పౌష్టికాహారం దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లలు తల్లులు గర్భిణీ స్త్రీలు గ్రామ మహిళలు పాల్గొన్నారు.
- Advertisement -