Monday, March 16, 2026
E-PAPER
Homeఖమ్మంఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు

ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు

- Advertisement -

– హాజరైన మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ “జూపల్లి” 
నవతెలంగాణ – అశ్వారావుపేట

పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా వాసవి క్లబ్, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి అశ్వారావుపేట మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ జూపల్లి రమేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరై, శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ జోన్ చైర్మన్ జల్లిపల్లి దేవరాజు, అధ్యక్షులు సమయమంతుల మోహన్ గంగాధర్ రావు, సెక్రటరీ ఉప్పల పవన్ కుమార్, ట్రెజరర్ రావి క్రాంతి కుమార్ రాజా, ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు చీమకుర్తి శ్రీనివాసరావు, కొనిజర్ల ఉమామహేశ్వరరావు, టౌన్ అధ్యక్షులు జలిపల్లి లోకనాథ్, కన్యకా పరమేశ్వరి దేవాలయం మాజీ అధ్యక్షులు ముత్తా సుమాకర్, మాజీ అధ్యక్షులు చీమకుర్తి వెంకటేశ్వరరావు, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సంకా ప్రసాద్, ఆర్యవైశ్య పెద్దలు 

తోకల హరీష్,తాత శ్రీను,కంచర్ల భాస్కరరావు,కుంచం సుబ్బారావు,వెంకట్రావు పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఉప్పల పవన్ కుమార్ మెడికల్ షాప్ ఎదుట మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వాసవి క్లబ్ అధ్యక్షులు సమయమంతుల మోహన్ గంగాధర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -