సాయికృష్ణ హీరోగా, దర్శకుడు వెంకటరమణ పసుపులేటి రూపొందిస్తున్న మూవీ ‘పవర్’. ఈ మూవీ ఇటీవల ఘనంగా ప్రారంభమైంది. ‘నాది పొగరు కాదురా… నా జాతికి ఈ దేవుడు ఇచ్చిన పవర్…’ అనే పవర్‌ఫుల్ డైలాగ్‌తో సాయికష్ణ సినీ ఎంట్రీ ఇచ్చారు. మంగళగిరి పరిధిలోని ఆత్మకూరులో వంగవీటి రంగా విగ్రహం వద్ద ముహూర్తం షాట్‌తో ఈ సినిమా చిత్రీకరణ ఆరంభమైంది.
ప్రారంభోత్సవంలో సాయికష్ణ పర్సనాలిటీ, అభినయం అతిథులను ఆకట్టుకుని ప్రశంసలు అందుకున్నాయి. ఈ చిత్రంలో అరుణ్ విజరు, సుజన, భాగ్యశ్రీ, ప్రజ్ఞ, ప్రియతో పాటు సీనియర్ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం యువతను ఆకట్టుకునే శక్తివంతమైన కథాంశంతో, అద్భుతమైన సాంకేతిక విలువలతో రూపొందుతోంది. సాయికష్ణ హీరోగా ఈ చిత్రం టాలీవుడ్‌లో కొత్త ఒరవడిని సష్టిస్తుందని చిత్ర యూనిట్ దీమా వ్యక్తం చేసింది. ఈ చిత్రానికి సంగీతం: శంకర్ మహదేవన్, సినిమాటోగ్రఫీ: బి.ఎస్.కుమార్, ఎడిటింగ్: నందమూరి హరి, సమర్పణ: ఎస్.ఐ.ఎఫ్.ఏ.ఏ, కథ, స్క్రీన్ ప్లే, మాటలు దర్శకత్వం: వెంకటరమణ పసుపులేటి.
సరికొత్త కథతో ‘పవర్’
- Advertisement -
- Advertisement -