నవతెలంగాణ – తిరుమలగిరి : మండల కేంద్రంలోని తాటిపాముల గ్రామానికి చెందిన చెరుకు సోమయ్య పెద్ద కుమార్తే ప్రభాదేవి చెరుకు ఇటివల ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన 84వ స్నాతకోత్సవం పురస్కరించుకొని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్. కుమార్ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా అందుకున్నారు. డాక్టర్ వి బి నరసింహా పర్యవేక్షణలో ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ ఇన్ పబ్లిక్ క్లౌడ్ ఫ్రేమ్ వర్క్స్ అనే అంశంపై డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీ నుండి పరిశోధన పూర్తి చేశారు. ఈ సందర్భంగా ప్రభాదేవి చెరుకు పరిశోధనకు సహకారం అందించిన డిపార్ట్మెంట్ హెడ్,బి ఓ ఎస్, డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఇన్ఫర్మాటిక్స్, గురువులకు, తల్లిదండ్రులకు, బంధుమిత్రులకు, తోటి స్కాలర్లకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, కృతజ్ఞతలు తెలిపారు
డాక్టరేట్ అందుకున్న ప్రభాదేవి చెరుకు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES