Thursday, October 23, 2025
E-PAPER
Homeతాజా వార్తలుప్రభాస్‌కు సోషల్‌ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

ప్రభాస్‌కు సోషల్‌ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: స్టార్‌ హీరో ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ ప్రముఖులు, దర్శక నిర్మాతలు ఆయన బర్త్‌డే విషెస్‌ తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. ప్రభాస్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఇక బాహుబలి అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో #HappyBirthdayPrabhas, #DarlingTurns46, #RebelStarDay వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో ట్రెండ్స్ సృష్టిస్తున్నారు. అంతేకాకుండా అనేక ప్రాంతాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపులు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నా సోదరుడు ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. జీవితమంతా నీపై విధేయతతో ఉంటాను. బాక్సాఫీస్ వద్ద నీ తుఫాను కొనసాగుతూనే ఉండాలి అంటూ హీరో మంచు విష్ణు ఎక్స్‌ వేదికగా ట్వీట్ చేశారు. ఇటీవల విడుదలైన కన్నప్ప సినిమాలో వీరిద్దరూ కలిసి నటించిన విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -