నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మోతిహరిలో పర్యటించారు. రూ.7,000 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మోడీ ప్రసంగిస్తూ కాంగ్రెస్, ఆర్జేడీపై నిప్పులు చెరిగారు. బీహార్‌లో పేద ప్రజల అభ్యున్నతి గురించి ఆర్జేడీ, కాంగ్రెస్ ఎప్పుడైనా ఆలోచించాయా? అని ప్రశ్నించారు. ఆర్జేడీ-కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యం అని విమర్శించారు. తూర్పు భారతదేశంలో సమగ్ర అభివృద్ధికి ‘విక్షిత్ బీహార్’ ఎంతైనా అవసరం ఉందని చెప్పారు. యూపీఏ, ఆర్జేడీ ప్రభుత్వాల కాలంలో కేవలం రూ.2లక్షల కోట్ల గ్రాంట్లు మాత్రమే మంజూరు అయ్యాయని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏను గెలిపిస్తే.. సరికొత్త బీహార్‌ను చూపిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా పాల్గొన్నారు. ప్రధాని మోడీ నాలుగు కొత్త అమృత్ భారత్ రైళ్లను కూడా జెండా ఊపి ప్రారంభించారు.