Saturday, October 4, 2025
E-PAPER
Homeజిల్లాలుస్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రజావాణి రద్దు

స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రజావాణి రద్దు

- Advertisement -

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడిన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన సందర్భంగా ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయబడిందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం ప్రజావాణి కార్యక్రమం తిరిగి యధావిధిగా కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -