నవతెలంగాణ-హైదరాబాద్: భారత-అమెరికా వాణిజ్య ఒప్పందం భారతదేశ సార్వభౌమాధికారంపై దాడి అని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) సీనియర్ నాయకులు ప్రకాష్ కారత్ విమర్శించారు. ఈ ఒప్పందం ద్వారా ట్రంప్ పాలన భారతదేశంపై తన సామ్రాజ్యవాద, కార్పొరేట్ ప్రయోజనాలను రుద్దిందని పేర్కొన్నారు. గురువారం ఈఎంఎస్ పరిశోధన కేంద్రం నిర్వహించిన భారత-అమెరికా వాణిజ్య సంబంధాల ప్రభావాలపై జరిగిన సెమినార్‌లో కారత్ పాల్గొని, ప్రసగించారు. “ఈ ఒప్పందం యుఎస్ ఉత్పత్తులను భారతదేశంలోకి వరదలా ముంచెత్తుతుంది. ఇది స్థానిక ఉత్పత్తులను మార్కెట్ నుండి తొలగిస్తుంది” అని ఆయన అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి మరియు సెంటర్ చైర్‌పర్సన్ ఎస్.సతీష్ అధ్యక్షత వహించారు. పార్టీ నాయకులు సి.ఎం దినేష్ మణి, ఎన్.అనిల్‌కుమార్, సిఐటియు నాయకురాలు దీపా, కె.రాజన్ హాజరైన వారిలో ఉన్నారు.
యూఎస్ డీల్‌పై ప్రకాష్ కారత్ విమర్శలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



