- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ కులదురహంకార హత్య(2018) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జీవిత ఖైదు అనుభవిస్తున్న నిందితుడు శ్రవణ్‌కుమార్ (అమృత బాబాయ్)కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జీవిత ఖైదును సవాల్ చేస్తూ తాను దాఖలు చేసిన పిటిషన్ విచారణ ముగిసే వరకు బెయిల్ ఇవ్వాలని శ్రవణ్ మధ్యంతర పిటిషన్ వేశారు. వాదనలు విన్న ధర్మాసనం అతని వయసు, జైలు జీవితాన్ని పరిగణనలోకి తీసుకుని బెయిల్ ఇచ్చింది.
- Advertisement -



