నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ ఎన్నికల వ్యుహాకర్త, జనసురజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ 51మందితో మొదటి జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా రెండో జాబితాలో ఆయన పార్టీ నుంచి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. 65మందితో కూడిన తమ పార్టీ అభ్యర్థుల పేర్లను విడుదల చేశారు. అందులో ఎస్సీ రిజర్వ్ స్థానాలకు 18, ఎస్టీ స్థానానికి ఒకరు పోటీ చేయనున్నారు. మిగిలిన 46 మంది అభ్యర్థులు జనరల్ స్థానాల్లో బరిలోకి దిగనున్నారు. అక్టోబర్ 9న ప్రశాంత్ కిశోర్ మొదటి జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న మొత్తం 51మందితో తన పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. రెండో జాబితాతో కలిపి ఇప్పటివరకు మొత్తం 116 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లు తెలిపారు. మిగిలిన స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు.మొత్తం 243 బీహార్ అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. వచ్చే నెల నవంబర్ 6న మొదటి దఫాలో 121 స్థానాలకు, నవంబర్ 11న మిగిలిన స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. 14న ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు.
రెండో జాబితా విడుదల చేసిన ప్రశాంత్ కిశోర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES