నవతెలంగాణ-హైదరాబాద్: మరోసారి ఎన్డేయే కూటమికి జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ సవాల్ విసిరారు. ఎన్నికల వాగ్ధానాలను సంపూర్ణంగా అమలు చేస్తే..రాజకీయల నుంచి తప్పుకుంటానని పాట్నా మీడియా సమావేశంలో చెప్పారు. ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన కింద 1.5 కోట్ల మంది మహిళలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు బదిలీ చేస్తామని ఎన్డీఏ ఎన్నికల హామీని నెరవేర్చినట్లయితే..ఖచ్చితంగా రాజకీయాలతో బీహార్ ను వదిలి వెళ్లిపోతానని చెప్పారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏన్డేయే కూటమి గెలిస్తే..తాను రాజకీయాలను వదిలేస్తానని ఓ ఎన్నికల ప్రచార ర్యాలీలో జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. కానీ పోలింగ్ ఫలితాలు వెలువడిన తర్వాత ఆయన మాట మార్చారు. తాజాగా పాట్నాలో మీడియా విలేఖర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఎన్డేయే సర్కార్ ఎన్నికల వాగ్ధానాలను సక్రమంగా అమలు చేసిన రోజు ఖచ్చితంగా రాజకీయల నుంచే కాకుండా బీహార్ ను కూడా వదిలి వెళ్తానని చెప్పారు. తాము బీహార్‌లో హిందూ-ముస్లిం రాజకీయాలు చేయలేదని, మతం పేరుతో ప్రజలను విభజించే నేరం తాము చేయలేదన్నారు. బీహార్‌లోని పేద, అమాయక ప్రజలకు డబ్బు ఇచ్చి వారి ఓట్లు కొనుగోలు చేసే నేరం మేము చేయలేదని ప్రశాంత్ కిశోర్ అన్నారు.
ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. ఆ పార్టీ అభ్యర్థులు 238 స్థానాల్లో పోటీ చేసినా..ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదు. ఏన్డేయే 202 స్థానాలు సాధించగా, మహాగఠ్ బంధన్ 35 సీట్లుకు పరిమితమైంది.



