నవతెలంగాణ-హైదరాబాద్: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఇవాళ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ముంబాయి వాంఖడే స్టేడియం వేదికగా ఇంగ్లాండ్, ఇండియా జట్లు తలపడనున్నాయి. ఈక్రమంలోనే క్రికెట్ అభిమానులు టీమిండియా బ్రిటన్ పై గెలువాలని పూజలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లోని ఇండియా క్రికెట్ అభిమానులు వివిధ దేవతలకు ప్రార్థనలు చేస్తున్నారు. సెమీస్ మ్యాచ్‌లో విజయం సాధించి ఫైనల్ కు వెళ్లాలని కోరుతున్నారు. అయితే బుధవారం జరిగిన మొదటి సెమీ పోరులో దక్షణాఫ్రికా టీంపై కివీస్ ఆఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్ టీం ఫైనల్ కు దూసుకెళ్లింది. సెకండ్ సెమీ పోరులో గెలిచిన టీం..కివీస్‌తో మార్చి 8న తుది పోరులో తలపడనుంది.
సెమీస్‌లో టీమిండియా గెలువాలని ప్రార్థనలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



