Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంప్రీ ప్రైమరీ పీఎం శ్రీవిద్యను అంగన్‌వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలి

ప్రీ ప్రైమరీ పీఎం శ్రీవిద్యను అంగన్‌వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలి

- Advertisement -

– పోటీ సెంటర్లను రద్దు చేసి, కొత్త దరఖాస్తులు తీసుకోవడం ఆపాలి
– వికారాబాద్‌లోని స్పీకర్‌ క్యాంపు కార్యాలయం ఎదుట అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) ఆధ్వర్యంలో ధర్నా
– తక్షణమే సీఎంతో మాట్లాడుతానంటూ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ హామీ
నవతెలంగాణ-వికారాబాద్‌

ప్రీ ప్రైమరీ పీఎం శ్రీవిద్యను అంగన్‌వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలని, కొత్త దరఖాస్తులు తీసుకోవడం ఆపాలని డిమాండ్‌ చేస్తూ అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో వికారాబాద్‌ పట్టణంలోని స్పీకర్‌ క్యాంపు కార్యాలయం ఎదుట శుక్రవారం అంగన్‌వాడీలు పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. ముందుగా పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం నుంచి స్పీకర్‌ క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, ధర్నా చేపట్టారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. అనంతరం పలు సమస్యలతో కూడిన మెమోరాండంను స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా అధ్యక్షకార్యదర్శులు ఆర్‌. మహిపాల్‌, భారతి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యాబోధన బాధ్యతను అంగన్‌వాడీలకు ఇవ్వాలన్నారు. ఆరేండ్ల లోపు పిల్లలకు ప్రయివేట్‌ స్కూల్స్‌ నడపడానికి అనుమతి ఇవ్వొద్దని డిమాండ్‌ చేశారు. ప్రీ ప్రైమరీ పిల్లలకు చదువుతోపాటు పౌష్టికాహారం ముఖ్యమని, ఐసీడీఎస్‌ అదే లక్ష్యంతో పనిచేస్తోందని అన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఐసీడీఎస్‌ వ్యవస్థ కూప్పకూలిపోతుందని తెలిపారు. ఐసీడీఎస్‌ బలోపేతానికి నిధులు కేటాయించాలని, నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. ఖాళీలను భర్తీ చేయాలని, తమపై అదనపు భారం మోపొద్దని కోరారు. పోటీ సెంటర్లను రద్దు చేయాలని, కొత్త దరఖాస్తులు తీసుకోవడం ఆపాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఎమ్మెల్యేల ఇండ్ల ముట్టడితోపాటు కొడంగల్‌లో సీఎం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. అంగన్‌వాడీల ధర్నాకు కేవీపీస్‌ జిల్లా అధ్యక్షులు నవీన్‌కుమార్‌, నాయకులు లక్ష్మణ్‌ మద్దతు తెలిపారు.
సీఎంతో మాట్లాడుతా : స్పీకర్‌ హామీ
అంగన్‌వాడీ ధర్నాపై స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ స్పందించారు. వారి సమస్యలను విని సానుకూలంగా స్పందించారు. అంగన్‌వాడీల డిమాండ్లపై సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి.. పోటీ సెంటర్లు రాకుండా చూస్తానని తెలిపారు. అంగన్‌వాడీలకే ప్రీ ప్రైమరీ పీఎం శ్రీవిద్యను అప్పగించేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు లక్ష్మి, భారతి, విజయలక్ష్మి, నిర్మల, కవిత, యాదమ్మ, సత్యమ్మ, మంజుల, సుజాత, యాదమ్మ, సత్యమ్మ, భారతి, మనోహర, లక్ష్మి, భాగ్యలక్ష్మి, అండాలు, తారాబాయి, విజయబాయి, లక్ష్మీబాయి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad