No menu items!
Saturday, August 23, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeరాష్ట్రీయంప్రీ ప్రైమరీ పీఎంశ్రీ విద్యను అంగన్వాడీల్లోనే చేపట్టాలి

ప్రీ ప్రైమరీ పీఎంశ్రీ విద్యను అంగన్వాడీల్లోనే చేపట్టాలి

- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట అంగన్‌వాడీల ధర్నాలు
ఫేస్‌ క్యాప్చర్‌ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌
నవ తెలంగాణ- విలేకరులు

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న ఫ్రీ ప్రైమరీ, పీఎంశ్రీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలని అంగన్‌వాడీలు డిమాండ్‌ చేశారు. ఐసీడీఎస్‌ను బలపేతం చేసి అంగన్వాడీ టీచర్ల, వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. అంగన్వాడీ సేవలకు తప్పనిసరి చేసిన పోసన్‌ ట్రాకర్‌ యాప్‌లో ఫేస్‌ క్యాప్చర్‌ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి జయలక్ష్మి, అధ్యక్షులు కె.సునీత డిమాండ్‌ చేశారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేశారు. వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా అంగన్‌వాడీలు ధర్నాలో పాల్గొన్నారు. మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌ ఎదుట ధర్నాలో జయలకిë పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఐసీడీఎస్‌తో పాటు విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడం కోసం నూతన జాతీయ విధాన విద్యావిధాన చట్టాన్ని తెచ్చిందన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ విజయేంద్ర బోయిని కలిసి వినతిపత్రం అందజేశారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా కేంద్రంలో నిరసన చేసి అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు ధర్నా అనంతరం అడిషనల్‌ కలెక్టర్‌ లక్ష్మీనారాయణకి వినతి అందజేశారు. పీఎంశ్రీ పాఠశాలలను అంగన్‌వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలని, ఫేస్‌ క్యాప్చర్‌, ఈకేవైసీ యాప్‌లను రద్దు చేయాలని అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు కె.సునీత డిమాండ్‌ చేశారు. ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట జరిగిన ఆందోళనలో ఆమె పాల్గొన్నారు. ముందుగా సీఐటీయూ కార్యాలయం నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. మంచిర్యాల కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలిపి ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టి ఏఓకు వినతిపత్రం అందజేశారు. రంగారెడ్డి, వికారాబాద్‌ కలెక్టరేట్ల ఎదుట ధర్నా నిర్వహించారు.
మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట భారీ ధర్నా జరిగింది. జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయం ముందు అంగన్‌వాడీలు నిరసన వ్యక్తం చేశారు. జనగామలో ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ములుగు జిల్లా కేంద్రంలో డీఎల్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌ నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. మెదక్‌, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేశారు. నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌ ముందు ధర్నా అనంతరం, కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, డీడబ్య్లూఓ కృష్ణవేణికి వినతిపత్రాలు అందజేశారు. భువనగిరి, సూర్యాపేట కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేశారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో కలెక్టర్‌ కార్యాలయం ముందు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అంగన్‌వాడీలు భారీ ధర్నా నిర్వహించారు. భద్రాద్రి జిల్లాలో ఐసీడీఎస్‌ డిడబ్ల్యూఓ స్వర్ణలతకు వినతిపత్రాన్ని అందజేశారు. ఖమ్మంలో అదనపు కలెక్టర్‌ శ్రీజకు వినతిపత్రం అందజేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad