Friday, May 9, 2025
Homeజాతీయంయుక్త వయసు రాక ముందేలైంగిక వేధింపులు బాలికల పైనే అధికం

యుక్త వయసు రాక ముందేలైంగిక వేధింపులు బాలికల పైనే అధికం

- Advertisement -

– దక్షిణాసియాలో భారత్‌దే మొదటి స్థానం : లాన్సెట్‌ జర్నల్‌ వెల్లడి
న్యూఢిల్లీ:
ప్రపంచంలో ప్రతి ఐదుగురు బాలికలలో ఒకరు, ప్రతి ఏడుగురు బాలురలో ఒకరు 18 సంవత్సరాల వయసు నిండకుండానే లైంగిక వేధింపులకు గురవుతు న్నారు. 2023లో మన దేశంలో 30 శాతం మంది బాలిక లు, 13 శాతం మంది బాలురు ఈ విధమైన లైంగిక వేధిం పులకు గురయ్యారని లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఓ విశ్లేషణ తెలిపింది. 1990-2023 మధ్య కాలంలో 200కు పైగా దేశాలలో బాలలపై జరిగిన లైంగిక వేధింపులకు సంబంధించి ఈ అధ్యయనం అంచనాలు రూపొందించింది. బాలికలపై దక్షిణాసియాలో అధికంగా లైంగిక వేధింపులు నమోదయ్యాయని తెలిపింది. ఈ ప్రాంతానికి సంబంధించి బంగ్లాదేశ్‌లో బాలికలపై లైంగిక వేధింపులు 9.3 శాతం నమోదవగా భారత్‌లో అత్యధికంగా 30.8 శాతం రికార్డయ్యాయని వివరించింది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఎవాల్యుయేషన్‌ పరిశోధకులు ఈ అధ్యయనంలో భాగస్వాములయ్యారు. 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న బాలికలకు సంబంధించి సబ్‌-సహారన్‌ ఆఫ్రికాలో (సహారాకు దక్షిణంగా ఉన్న ఆఫ్రికా ఖండంలోని ప్రాంతాలు) లైంగిక వేధింపుల రేటు అధికంగా ఉన్నదని అధ్యయనంలో తేలింది. ఈ ప్రాంతంలోని జింబాబ్వేలో 8 శాతం రేటు నమోదవగా పశ్చిమ ఆఫ్రికాలోని ఐవరీ కోస్ట్‌లో అత్యధికంగా 28 శాతం రికార్డయింది.
పరిమిత సమాచారంతోనే…
బాలలపై లైంగిక వేధింపులు అనేది తీవ్రమైన ప్రజారోగ్య, మానవ హక్కులకు సంబంధించిన అంశం. లైంగిక వేధింపులు జరిగినప్పుడు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య లు ఉత్పన్నమవుతాయి. వారి మానసిక ఆరోగ్య పరిస్థితి కూడా దెబ్బతింటుంది. ఇలాంటి ఘటనలు జరకుండా ఉండాలంటే లైంగిక వేధింపులకు సంబంధించిన కచ్చితమె ౖన అంచనాలు అవసరమని అధ్యయనం అభిప్రాయపడింది. అయితే ప్రస్తుతం కొన్ని పరిమిత దేశాలలో మాత్రమే సమాచారం అందుబాటులో ఉన్నదని, దానిలో కూడా సమగ్రత లోపించిందని, అంచనాలకు రావడంలో సవాళ్లు ఎదురవుతున్నాయని తెలిపింది. లైంగిక వేధింపులపై అంతర్జాతీయ అంచనాలు రూపొందించిన తొలి అధ్యయనం ఇదే కావడం గమనార్హం. అందుబాటులో ఉన్న డేటా ఆధారంగానే అందులో అంచనాలు వేయడం జరిగింది.
అధ్యయనం ఏం చెప్పింది?

ప్రపంచవ్యాప్తంగా 2023లో వయసు-చిన్నా రులపై లైంగిక హింస అనేది బాలికలలో 18.9 శాతం, బాలురలో 14.8 శాతంగా ఉన్నదని తాము అంచనా వేశామని అధ్యయన రచయితలు తెలిపారు. 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న యువతీ యువ కులలో మొదటిసారి లైంగిక హింసకు గురికావడం అనేది సుమారు 70 శాతం మందిలో జరిగిందని వారు చెప్పారు. లైంగిక హింస నుండి బయటపడిన వారికి జీవితాంతం అండగా ఉండడానికి, చిన్నారులకు లైంగిక హింసకు తావు లేని బాల్యాన్ని అందించడానికి మరిన్ని సేవలు, వ్యవస్థలు అవసరమని వారు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -