- Advertisement -
నవతెలంగాణ-భిక్కనూర్ : మండలంలోని కంచర్ల, అయ్యవారిపల్లి గ్రామాలలో డెంగ్యూ పాజిటివ్ వచ్చిన కారణంగా సోమవారం ప్రాథమిక ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పాజిటివ్ వచ్చిన వ్యక్తుల ఇంటి పరిసరాలను పరిశీలించారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను పరిశీలించి నీరు పారబోశారు. ప్రజలందరూ సీజనల్ వ్యాధుల కారణంగా ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని దోమలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మెడికల్ అధికారి యేమిమా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం ఎల్ హెచ్ పీ పూజ, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది, తదితరులు ఉన్నారు.
- Advertisement -