Thursday, January 1, 2026
E-PAPER
Homeఆదిలాబాద్108 అంబులెన్సులో ప్రసవించిన గ‌ర్భ‌ణీ

108 అంబులెన్సులో ప్రసవించిన గ‌ర్భ‌ణీ

- Advertisement -

నవతెలంగాణ-కన్నాయిగూడెం: ములుగు జిల్లాలో ఓ గ‌ర్భ‌ణీ 108 అంబులెన్సుకులోనే ఓ బిడ్డ‌కు జ‌న్మించింది. కన్నాయిగూడెం మండలం గూర్రేవుల గ్రామానికి చెందిన వాసంపల్లి మహేశ్వరీకి పురిటి నొప్పులు రావడంతో.. భర్త వాసంపల్లి నవీన్ 108 అంబులెన్సుకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్సు పైలెట్ రవీందర్, ఈఎంటీ మహేశ్వరీ హుటాహుటిన గూర్రేవుల గ్రామానికి చేరుకున్నారు. మెరుగైన వైద్య సేవల కోసం ఏటూరునాగారం తరలిస్తుండ‌గా మార్గమధ్యలో పురిటినొప్పులు ఎక్కువ కావడంతో.. ఈఎంటీ మహేశ్వరీ చాకచక్యంగా వ్యవహరించి స‌దురు మ‌హిళ‌కు ప్ర‌సవం చేసింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -