Tuesday, November 4, 2025
E-PAPER
HomeNews132/33 కెవి సబ్ స్టేషన్ ఏర్పాటుకు  సన్నద్ధం.!

132/33 కెవి సబ్ స్టేషన్ ఏర్పాటుకు  సన్నద్ధం.!

- Advertisement -

మాజీ ఎంపీపీ..చింతలపల్లి మలహల్ రావు
నవతెలంగాణ-మల్హర్ రావు

మండల కేంద్రమైన తాడిచర్లలో 132/33 కేవీ సబ్ స్టేషన్ ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నట్లుగా తాజా మాజీ ఎంపీపీ చింతలపల్లి మలహల్ రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మండలంలో సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని గతంలో పలుమార్లు రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబుకు విన్నవించినట్లుగా పేర్కొన్నారు.ఇందుకు మంత్రి శ్రీదర్ బాబు సానుకూలంగా స్పందించినట్లుగా తెలిపారు.ఇటీవల మంత్రి ట్రాన్స్కోకు ఇచ్చిన ప్రతిపాదనల మేరకు భూపాలపల్లి ట్రాన్స్కో డీఈ ఆదేశాల మేరకు ఏడీ కుమారస్వామి తాడిచర్లలో ప్రభుత్వ స్థలంపై ఆరా తీశారని తెలిపారు.సోమవారం తాడిచర్ల తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి తహసీల్దార్ రవికుమార్ తో  ప్రభుత్వం స్థలం కేటాయింపు గురించి ట్రాన్స్ కో ఏడీ అడిగి తెలుసుకున్నట్లుగా తెలిపారు.సబ్ స్టేషన్ ఏర్పాటుకు మండలంలోని తాడిచర్ల, పెద్దతూండ్ల, కొయ్యూరులో 5 ఎకరాల మేరక ప్రభుత్వ స్థలం కావాలని తహసీల్దార్ ను కొరినట్లుగా వివరించారు.ప్రభుత్వం స్థలం కేటాయించాలని ట్రాన్స్కో నుంచి తహసీల్దార్ కార్యాలయానికి లేటరు కూడా సమర్పించారని చెప్పారు.దీంతో సబ్ స్టేషన్ ఏర్పాటు అధికారులు సన్నద్ధమవుతున్నారని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -