నవతెలంగాణ-హైదరాబాద్: జస్టిస్ యశ్వంత్ వర్మపై అభింశన తీర్మానానికి మద్దతు తెలుపుతు అన్ని పార్టీల ఎంపీలు స్పీకర్‌కు లేఖను అందజేశారు. మొత్తం 145 లోక్ సభ సభ్యులు అభింశన తీర్మానంపై సంతకాలతో కూడిన మెమోరాండమ్ ను స్పీకర్ ఓం బిర్లాకు అందజేశారు. ఈ తీర్మానం కాపీపై కాంగ్రెస్, TDP, JDU, JDS, జనసేన,AGP,SS (షిండే), LJSP, SKP, CPM తదితర పార్టీల ఎంపీలు సంతకాలు చేశారు.
ఆదివారం, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు జస్టిస్ వర్మ తొలగింపు నోటీసుపై 100 మందికి పైగా పార్లమెంటు సభ్యులు సంతకం చేశారని ధృవీకరించారు. అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నియమించిన ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తుల న్యాయ కమిటీ జస్టిస్ వర్మపై నేరారోపణ చేసి, ఈ విషయాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సూచించింది. జస్టిస్ వర్మ రాజీనామా చేయడానికి నిరాకరించడంతో వారు ఆయన తొలగింపుకు సిఫార్సు చేశారు. కమిటీ తీర్పులకు వ్యతిరేకంగా జస్టిస్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈఏడాది మార్చి 15న ఢిల్లీలోని జస్టిస్ వర్మ అధికారిక నివాసంలో కాలిపోయిన, సగం కాలిన రూ. 500 కరెన్సీ నోట్లు ఉదంతం వెలుగు చూసిన విషయం తెలిసిందే.