Tuesday, July 22, 2025
E-PAPER
Homeజాతీయంజగదీప్ ధన్‌ఖర్ రాజీనామాకు రాష్ట్రప‌తి ఆమోదం

జగదీప్ ధన్‌ఖర్ రాజీనామాకు రాష్ట్రప‌తి ఆమోదం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: జగదీప్ ధన్‌ఖర్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. వ‌ర్షాకాల పార్ల‌మెంట్ స‌మావేశాలు కొన‌సాగుతుండా ఆయ‌న అనూహ్యంగా ఉప‌రాష్ట్రప‌తి ప‌ద‌వికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్రపతికి లేఖ పంపారు. మంగళవారం ధన్‌ఖర్ రాజీనామా ఆమోదించినట్లు రాష్ట్రపతి కార్యాలయం తెలిపింది. ధన్‌ఖర్ రాజీనామా తర్వాత ప్రధాని మోడీ కీలక ట్వీట్ చేశారు. ధన్‌ఖర్ ఆరోగ్యం బాగుండాలని ఆకాంక్షించారు.

అయితే ధన్‌ఖర్ రాజీనామాపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదో బలమైన కారణంతోనే రాజీనామా చేశారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. పార్టీ పెద్దలు అవమానించడం వల్లే ఇంత వేగంగా ధన్‌ఖర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఇక తదుపరి ఉపరాష్ట్రపతిగా డిప్యూటీ ఛైర్మన్, జేడీయూ నేత హరివంశ్ ఉపరాష్ట్రపతి అవ్వొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -