Monday, January 26, 2026
E-PAPER
Homeజాతీయంజాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము

జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కర్తవ్యపథ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సారి గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథులుగా యూరోపియన్ యూనియన్ కమిషన్ ప్రసిడెంట్ ఉర్సులా వాన్ డర్ లెయెన్, యూరోపియన్ యూనియర్ కౌన్సిల్ ప్రసిడెంట్ ఆంటోనియో కోస్టా హాజరయ్యారు.. గణతంత్ర వేడుకల్లో ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు, ప్రముఖులు పాల్గొన్నారు.  గణతంత్ర వేడుకల్లో భాగంగా నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమర జవాన్లకు ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్  నివాళులర్పించారు.

ఢిల్లీలో గణతంత్ర వేడుకలకు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఢిల్లీ వ్యాప్తంగా 30 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. కేవలం ఢిల్లీ జిల్లాలోనే 10 వేల మంది పోలీసులను మోహరించారు. రిపబ్లిక్ డే ఉత్సవాల్లో త్రివిధ దళాల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎర్ర కోట నుంచి రాష్ట్ర పతిభవన్ వరకు సైనిక కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కవాతులో ఇండోనేషియా సైన్యం కూడా పాల్గొన్నది. కర్తవ్య పథ్ లో గణతంత్ర వేడుకల సంబురాలు అంబరాన్నంటాయి. కర్తవ్య పథ్ కు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -