నవతెలంగాణ-హైదరాబాద్: భారత్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విదేశీ పర్యటనకు బయలుదేరారు. అధికారిక విమానంలో రాష్ట్రపతితో పాటు పలువురు అధికారులు ఉన్నారు. రెండు రోజులపాటు అంగోలా, బోట్సావానా దేశాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు శనివారం రాష్ట్రపతి కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ పర్యటనలో భాగంగా ఆయా దేశాలతో ద్వైపాక్షిక బంధాల బలోపేతానికి కృషి చేయనున్నారని తెలిపింది. మొదటి సారి ఆయా దేశాల్లో భారత్ రాష్ట్రపతి హోదాలో వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా అంగోలాతో రక్షణ, ఇందన రంగాల్లో సహయ సహకారాలు పెంపొందించుకోనున్నారు. ఇప్పటికే ఆదేశంలో దాదాపు 5 బిలియన్ డాలర్ల మేర వాణిజ్యం కొనసాగుతుండగా, 80 శాతం ఇంధన రంగంలోనే ఇరుదేశాల మధ్య సానుకూల ఒప్పందాలు కలిగి ఉన్నాయి.




