Saturday, July 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంబీసీల ఉద్యమంతో ప్రభుత్వంపై ఒత్తిడి: మాజీ మంత్రి తలసాని

బీసీల ఉద్యమంతో ప్రభుత్వంపై ఒత్తిడి: మాజీ మంత్రి తలసాని

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బీసీల ఉద్యమంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్‌ ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై అసెంబ్లీలోనూ బయటా బీఆర్‌ఎస్‌ తరపున పోరాడామని గుర్తు చేశారు. గవర్నర్‌ ద్వారా కేంద్రానికి బిల్లు పంపినప్పటికీ దాన్ని బైపాస్‌ చేస్తూ ఆర్డినెన్స్‌ తీసుకొస్తామని సీఎం చెబుతున్నారని తెలిపారు. గత అనుభవాల నేపధ్యంలో దీనిపై కొన్ని అనుమానాలున్నాయని గుర్తుచేశారు. ఆ అనుమానా లను నివృత్తి చేయాలని డిమాండ్‌ చేశారు. శాసన మండలి ప్రతిపక్ష నేత ముధుసూదనాచారి మాట్లా డుతూ బీసీల ఓట్లు కొల్లగొట్టేందుకే 42 శాతం రిజర్వే షన్ల హామీ ఇచ్చారని తెలిపారు. కేబినెట్‌ నిర్ణయాన్ని పరిశీలిస్తే ఇందులో ద్రోహంతో కూడిన కుట్ర కనిపిస్తోందని అనుమానాన్ని వ్యక్తం చేశారు. మాజీమంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ రేవంత్‌ సర్కార్‌ బీసీలను ఘరానా మోసం చేస్తున్నారని విమ ర్శించారు. 42 శాతం రిజర్వేషన్ల కోసం పూర్తిగా సహక రిస్తామని చెప్పారు. మాజీమంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ బీసీల మనోభావాలు దెబ్బతినేలా కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. అసెంబ్లీలో చర్చ సమయంలోనే తమకున్న అనుమా నాలు వ్యక్తం చేశామని గుర్తు చేశారు. ఆర్డినెన్స్‌ ద్వారా రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉంటే 20 నెల్లు ఎందుకు ఆలస్యం చేశారని ప్రశ్నించారు..బీసీ కమిషన్‌ మాజీ చైర్మెన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌, ఎమ్మెల్సీ డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ కుమార్‌,రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంతదితరులు మాట్లాడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -