- Advertisement -
నవతెలంగాణ-హైరదాబాద్: గత ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ బకాయిలను పెండింగ్‌లో ఉంచిందని శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇప్పటివరకు తమ ప్రభుత్వం రూ.2,408 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రులకు రూ.927 కోట్లు, ప్రైవేటు ఆస్పత్రులకు రూ.1,480 కోట్లు చెల్లించినట్లు సీఎం వివరించారు. శాసనసభలో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో రూ.2,046 కోట్ల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశామని చెప్పారు. గతంలో ఈ చెక్కుల విషయంలో అవినీతి జరిగిందన్నారు. 27 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పేదల వైద్యం కోసం రూ.4,500 కోట్లు చెల్లించామన్నారు.
- Advertisement -



