నవతెలంగాణ-హైదరాబాద్: రాజధాని అమరావతి పున: నిర్మాణ పనులను ప్రధాని మోడి ప్రారంభించారు. శుక్రవారం మధ్యాహ్నం అమరావతి పున: ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి మోడి విచ్చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు, పలువురు మంత్రుల ప్రసంగాల అనంతరం … ప్రధాని మోడి వర్చువల్ గా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలకు మోడి శంకుస్థాపన చేశారు. రాజధాని అమరావతిలో 18 ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. నాగాయలంకలో రూ.15,00 కోట్లతో నిర్మించే మిసైల్ టెస్ట్ రేంజ్‌కు శంకుస్థాపన చేశారు. రూ.3680 కోట్లతో విలువైన నేషనల్ హైవే పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. న్యాయమూర్తుల నివాస సముదాయాలకు శంకుస్థాపన చేశారు. రూ.254 కోట్లతో పూర్తి చేసిన ఖాజీపేట-విజయవాడ మూడో లేన్ ను ప్రారంభోత్సవం చేశారు. రూ.57,962 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
అమరావతి పున: నిర్మాణ పనులను ప్రారంభించిన ప్రధాని
- Advertisement -