Friday, November 7, 2025
E-PAPER
Homeజాతీయం‘వందేమాతరం’ 150వ స్మారకోత్సవంలో ప్రధాని మోడీ

‘వందేమాతరం’ 150వ స్మారకోత్సవంలో ప్రధాని మోడీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : స్వాతంత్య్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన ‘వందేమాతరం’ గేయానికి నేటితో 150 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్‌ స్టేడియంలో శుక్రవారం ‘వందేమాతరం’ 150వ స్మారకోత్సవం పేరుతో ప్రధాని మోడీ ప్రారంభించారు. వేడుకల్లో భాగంగా ప్రజలంతా సామూహికంగా వందేమాతరం గేయాలాపన చేశారు. వందేమాతరం గేయాన్ని నవంబరు 7, 1875న బంకించంద్ర ఛటర్జీ రచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -