Friday, February 13, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంతారిక్ రహ్మాన్‌కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..

తారిక్ రహ్మాన్‌కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : బంగ్లాదేశ్‌లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) ఘన విజయం సాధించడంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. పార్టీ అధినేత తారిక్ రహ్మాన్‌కు శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య, ప్రగతిశీల బంగ్లాదేశ్‌కు భారత్ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.

గురువారం బంగ్లాదేశ్ 13వ జాతీయ పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా పదవీచ్యుతురాలైన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు ఇవే. వెలువడుతున్న అనధికారిక ఫలితాల ప్రకారం 17 ఏళ్ల ప్రవాసం తర్వాత ఇటీవలే దేశానికి తిరిగి వచ్చిన తారిక్ రహ్మాన్ నేతృత్వంలోని బీఎన్‌పీ పార్టీ 300 స్థానాల పార్లమెంట్‌లో స్పష్టమైన మెజారిటీని కైవసం చేసుకుంది.

ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్‌’లో ఒక పోస్ట్ పెట్టారు. “బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఎన్‌పీని ఘన విజయపథంలో నడిపించినందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు. ఈ విజయం మీ నాయకత్వంపై బంగ్లాదేశ్ ప్రజలకు ఉన్న నమ్మకాన్ని చూపుతోంది. ప్రజాస్వామ్య, ప్రగతిశీల బంగ్లాదేశ్‌కు భారత్ తన మద్దతును కొనసాగిస్తుంది. ఇరుదేశాల మధ్య బహుముఖ సంబంధాలను బలోపేతం చేయడానికి మీతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను” అని మోడీ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -