Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రధాని మోడీ భేటీ..

 చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రధాని మోడీ భేటీ..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. రెండు రోజులు పర్యటనలో భాగంగా తియాన్‌జిన్‌ చేరుకున్న మోడీ.. షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. దీనికి ముందే అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సహకారాన్ని పెంపొంచుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కాగా, 2018 తర్వాత ప్రధాని మోడీ చైనాలో పర్యటించడం ఇదే మొదటిసారి.

భారత్‌, చైనా, రష్యా సహా 26 దేశాల అగ్రనేతలు పాల్గొనే షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) శిఖరాగ్ర సదస్సు తియాన్‌జిన్‌ నగరంలో జరుగనుంది. ఆది, సోమవారాల్లో జరుగనున్న ఈ సమావేశాలకు ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌లు హాజరవుతున్నారు. ఇటీవల ట్రంప్‌ వివిధ దేశాలపై విధించిన సుంకాలతో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అశాంతి నేపథ్యంలో ఈ ఎస్‌సీవో సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సుంకాల బాధకు గురైన పలు దేశాల అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. సుంకాలతో బెదిరిస్తున్న అమెరికాకు ఈ సమావేశం ఎలాంటి సందేశం, హెచ్చరిక ఇస్తుందన్న అంశంపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad