- Advertisement -
– ఒమర్ అబ్దుల్లాతో ప్రధాని మోడీ భేటీ
న్యూఢిల్లీ: ప్రధాని మోడీ శనివారం జమ్ముకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో సమావేశమయ్యారు. పహల్గాం ఉగ్రదాడితోసహా అనేక విషయాలపై, జమ్ముకాశ్మీర్‌లో పరిస్థితిపై చర్చించారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు వెల్లడించారు. ప్రధానమంత్రి నివాసంలో జరిగిన ఈ సమావేశం దాదాపు 30 నిమిషాల పాటు కొనసాగినట్లు తెలిపారు. పహల్గాంలో ఉగ్రదాడి తరువాత పాకిస్తాన్‌పై భారత్ అనేక తీవ్ర నిర్ణయాలు తీసుకుంటోంది. ఇలాంటి సమయంలో జమ్ముకాశ్మీర్ ముఖ్యమంత్రితో ప్రధాని మోడీ సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
- Advertisement -