Sunday, September 21, 2025
E-PAPER
Homeజాతీయంఈరోజు సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోడీ

ఈరోజు సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోడీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నట్లు పీఎమ్ఓ కార్యాలయం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆయన ప్రసంగంలో ఏ అంశాలు ప్రస్తావిస్తారనే దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అమెరికా తాజాగా H1B వీసాల రుసుములను భారీగా పెంచిన విషయం భారతీయ ఐటీ ఉద్యోగులు, విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తుండగా, ప్రధాని ఈ అంశంపై స్పందిస్తారా అన్నదే చర్చనీయాంశంగా మారింది. ఇకపై రాబోయే దసరా పండుగ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలతో ప్రధానిగా ప్రత్యేక సందేశం పంచుకుంటారని కూడా భావిస్తున్నారు. రేపటి నుంచి కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి రానున్నాయి. అయితే పండుగ సందర్భంగా ప్రధాని మోడీ దేశ ప్రజలకు మరేదైన శుభవార్తను చెబుతాడేమోనని విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -