- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: మరోసారి ప్రధాని మోడీ విదేశి పర్యటనకు వెళ్లనున్నారు.ఆగస్టు 29న మోదీ జపాన్ వెళ్లనున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్ మిశ్రీ ఈ విషయాన్ని ఇవాళ వెల్లడించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో ఆయన మాట్లాడుతారు. 2014లో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు 8 సార్లు జపాన్‌కు వెళ్లారు. రెండు దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. జపాన్ నుంచి ఆయన నేరుగా చైనాకు వెళ్తారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ ఒకటి వరకు జరిగే షాంఘై సహకార సంస్థ మీటింగ్‌కు హాజరవుతారు.
- Advertisement -