నవతెలంగాణ-హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం ఢిల్లీలోని కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ నివాసంలో జరిగే పొంగల్ వేడుకలకు హాజరవుతారు. దేశ ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు ప్రధాని మోడీ తెలియజేశారు. వివిధ ప్రాంతాల్లో తమ స్థానిక సంప్రదాయాల ప్రకారం జరుపుకుంటారని, ప్రజలకు సంతోషాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని సూర్య భగవానుడిని ప్రార్థిస్తున్నట్లు తన ఎక్స్ అకౌంట్‌లో ప్రధాని మోడీ తెలిపారు. అస్సాంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో ఇవాళ మాఘ బిహు పండుగను జరుపుకుంటారు. ఈ సందర్భంగా కూడా ఆయన ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సంతోషకర సంబరాలు బంధాలను మరింత బలోపేతం చేయాలని, సుఖసంపదలను ఇవ్వాలని, పాజిటివ్ దృక్పథాన్ని నింపాలని ఆశించారు.
దేశప్రజలకు పొంగల్ శుభాకాంక్షలు: ప్రధాని మోడీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



