నవతెలంగాణ-హైదరాబాద్: రేపట్నుంచి విదేశీ పర్యటనలతో ప్రధాని మోడీ బీజీబీజీగా గడపనున్నారు. ఈనెల 2 నుంచి 9 వరకు ఐదు దేశాల్లో పర్యటించనున్నారు. ఘనా, ట్రినిడాడ్-టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాల్లో ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. జులై 2, 3 తేదీల్లో మోదీ ఘనాలో ఉంటారు. 3, 4 తేదీల్లో ప్రధాని ట్రినిడాడ్-టొబాగోలో పర్యటించనున్నారు. 4నే అర్జెంటీనాకు వెళ్లనున్న ప్రధాని మోదీ.. మరుసటిరోజూ అక్కడే ఉంటారు. అనంతరం బ్రెజిల్ వెళ్తారు. ఆ దేశంలోని రియో డీ జనీరో వేదికగా 6-7 తేదీల్లో జరిగే బ్రిక్స్ 17వ సదస్సులో పాల్గొంటారు. ప్రధాని 9న నమీబియాకు వెళ్లి.. ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. గత 11 ఏళ్లలో మోదీ సుదీర్ఘ దౌత్య పర్యటనల్లో ఇదొకటి కానుంది.
రేపట్నుంచి ప్రధాని మోడీ విదేశీ పర్యటనలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES