Saturday, February 14, 2026
E-PAPER
Homeజాతీయంప్రధాని మోడీ అస్సాంలో పర్యటన‌.. మోరాన్ బైపాస్ ప్రారంభం

ప్రధాని మోడీ అస్సాంలో పర్యటన‌.. మోరాన్ బైపాస్ ప్రారంభం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ప్రధాని మోడీ అస్సాంలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా పలు ప్రాజెక్ట్‌లను ప్రారంభించారు. ఇక మోరన్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీని ప్రారంభించారు. ముందుగా దిబ్రూగఢ్ జిల్లాలోని చాబువా ఎయిర్‌ఫీల్డ్‌కు చేరుకున్న ఆయన.. అనంతరం మోరన్‌లోని ELFకు చేరుకోవడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ C-130 విమానంలో వెళ్లారు. ఇక మోరాన్ బైపాస్‌లోని అత్యవసర ల్యాండింగ్ సౌకర్యంపై నుంచి సుఖోయ్ టేకాఫ్ అయింది. ప్రధానమంత్రి మోడీ ప్రత్యక్షంగా వీక్షించారు. గత మూడు నెలల్లో అస్సాంకు మోడీ రావడం ఇది మూడవసారి. త్వరలోనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మోడీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

మోరాన్ చైనా సరిహద్దు నుంచి దాదాపు 300 కిలోమీటర్లు.. మయన్మార్ సరిహద్దు నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉండటం విషయం. ELF వ్యూహాత్మకంగా ముఖ్యమైన ప్రదేశంలో ఉంది. బుధవారం నుంచే ఎయిర్‌స్ట్రిప్‌లో ట్రయల్ రన్‌లు జరుగుతున్నాయి. విమానాలు ల్యాండ్ అవ్వడం, టేకాఫ్ అవ్వడం చూడటానికి పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -