- Advertisement -
నవతెలంగాణ ఢిల్లీ: గాంధీ జయంతిని పురస్కరించుకుని జాతిపిత మహాత్మాగాంధీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాళులర్పించారు. ఈ ఉదయం ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ను సందర్శించిన ఆయన.. గాంధీజీ స్మారకం వద్ద నివాళులర్పించారు. అంతకు ముందు ‘ఎక్స్’ వేదికగా మహాత్ముడి సేవలను గుర్తుచేసుకున్నారు.
”మన ప్రియమైన బాపూ అసాధారణ జీవితం, ఆదర్శాలు మానవ చరిత్ర గమనాన్ని మార్చాయి. ధైర్యం, నిరాడంబరతతో మార్పును సాధించుకోవచ్చని ఆయన నిరూపించారు. ప్రజలకు సేవ చేయడం, ఇతరులపై కరుణతో ఉండటమే మన సాధికారికతకు శక్తిమంతమైన సాధనాలు అని విశ్వసించారు. వికసిత్ భారత్‌ను నిర్మించడం కోసం మేం ఆయన మార్గాన్ని అనుసరిస్తూనే ఉంటాం’’ అని మోడీ రాసుకొచ్చారు.
Gandhi Jayanthi
- Advertisement -