Friday, December 12, 2025
E-PAPER
Homeజాతీయంబస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి.. రూ.2లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటన

బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి.. రూ.2లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటన

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం తులసిపాకలు మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన బస్సు ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదంలో ప్రాణనష్టం జరగడం చాలా బాధాకరం అని పేర్కొన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో బాధితులకు వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. అంతేకాకుండా ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుండి రూ.2లక్షలు, గాయపడినవారికి రూ.50వేల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -