Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంనేడు మధ్య‌ప్ర‌దేశ్‌లో ప‌ర్య‌టించ‌నున్న ప్ర‌ధాని

నేడు మధ్య‌ప్ర‌దేశ్‌లో ప‌ర్య‌టించ‌నున్న ప్ర‌ధాని

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ప్రధాని నరేంద్రమోదీ నేడు భోపాల్‌లో పర్యటించనున్నారు. లోకమాత దేవీ అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా భోపాల్‌లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. క్షిప్రానది పై రూ.860 కోట్ల వ్యయంతో తలపెట్టిన ఘాట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జంబోరి గ్రౌండ్‌ లో మహిళా సాధికారత మహాసదస్సుకు హాజరై.. బహిరంగసభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సదస్సుకు హాజరయ్యే మహిళలు సింధూర రంగు చీర ధరించాలని విజ్ఞప్తి చేశారు. లోకమాతదేవీ అహల్యాబాయి పోస్టల్ స్టాంపును, రూ.300 ప్రత్యేక నాణెం విడుదల చేయనున్నారు. ఈ పర్యటనలో ఇండోర్ మెట్రో, దాతియా – సత్నా ఎయిర్ పోర్టును వర్చువల్ గా ప్రారంభిస్తారు. ఉజ్జయినిలో 29 కిలోమీటర్ల పొడవైన ఘాట్ కు వర్చువల్ భూమిపూజ చేస్తారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad