Thursday, July 10, 2025
E-PAPER
Homeజాతీయంముగిసిన ప్ర‌ధాని విదేశీ ప‌ర్య‌ట‌న‌లు

ముగిసిన ప్ర‌ధాని విదేశీ ప‌ర్య‌ట‌న‌లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: 8 రోజుల విదేశీ ప‌ర్య‌ట‌న‌లు ముగించుకొని ప్ర‌ధాని మోడీ భార‌త్‌కు చేరుకున్నారు. చివరగా నిన్న నమీబియాలో పర్యటించిన ఆయన ప్రత్యేక విమానంలో భారత్ తిరిగి వచ్చారు. ఈ పర్యటనలో ప్రధాని మోడీ అనేక కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు.. మూడు దేశాల నుంచి అత్యున్నత పురస్కారాల ను అందుకున్నారు. అలాగే మూడు దశాబ్దాల తర్వాత భారత ప్రధాని ఘనా సందర్శించడం ఇదే మొదటిసారి గా నిలిచింది. ఘనా అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు, ఆర్థిక, ఇంధన, రక్షణ రంగాల్లో సహకారం పై దృష్టి పెట్టాయి.

అలాగే 1999 తర్వాత భారత ప్రధాని ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాన్ని సందర్శించారు. ఇరు దేశాల మధ్య ఆరోగ్యం, డిజిటల్ టెక్నాలజీ, రక్షణ రంగాల్లో సహకారం పై చర్చలు జరిగ్గా.. ఆరు ఒప్పందాలు కుదిరాయి.

రియో డి జనీరోలో 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని పాల్గొన్న అనంతరం బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వాతో చర్చలు జరిపారు. రక్షణ, వాణిజ్యం, గ్లోబల్ సౌత్ దేశాలతో సహకారంపై ఇరు దేశాలు దృష్టి సారించాయి. అలాగే నమీబియా పర్యటనలో వజ్రాల వ్యాపారం, ఆర్థిక సంబంధాలపై ఒప్పందాలు కీలక ఒప్పందాలు కుదిరాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -