నవతెలంగాణ-హైదరాబాద్: ప్రిన్స్ ఛార్లెస్ సోదరుడు ఆండ్రూ మాంట్‌బాటన్-విండర్స్(Andrew Mountbatten-Windsor)ను పోలీసులు రిలీజ్ చేశారు. ఎప్‌స్టీన్‌కు వాణిజ్య రహస్య సమాచారాన్ని చేరవేసిన కేసులో ఆయన్ను థేమ్స్ వ్యాలీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే విచారణలో ఉండగానే ఆయన్ను పోలీసు కస్టడీ నుంచి రిలీజ్ చేసినట్లు అధికారులు చెప్పారు. అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్‌సర్‌పై ఆరోపణలు ఉన్నాయి. గురువారమే మాజీ ప్రిన్స్ ఆండ్రూ రోజంతా ప్రశ్నలు ఎదుర్కొన్నారు. థేమ్స్ వ్యాలీ పోలీసు డిటెక్టివ్‌లు ఆయన్ను ప్రశ్నించారు. బ్రిటన్ ప్రత్యేక వాణిజ్య రాయబారిగా ఉన్న సమయంలో ఆయన జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు కొన్ని వాణిజ్య నివేదికలను, దేశానికి సంబంధించిన కొంత కీలక సమాచారాన్ని పంపారన్న ఆరోపణలపై తాజాగా ఆండ్రూను ఆ దేశ పోలీసులు అరెస్ట్ చేశారు.
.



