ప్రిన్స్, సుహానా ముద్వాన్ హీరో, హీరోయిన్లుగా ఓ కొత్త సినిమా ప్రారంభమైంది. సునైనా, నెల్లూరు సుదర్శన్ ప్రధాన పాత్రలలో కుమార్ రవికంటి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
ప్రముఖ నిర్మాణ సంస్థ లైట్ స్టోర్మ్ సెల్లులోయిడ్స్ పై కుమార్ రవి కంటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కెఎల్ స్టూడియోలో జరిగిన పూజా కార్యక్రమాలకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై, చిత్ర బందాన్ని అభినందించారు. ముహూర్తపు సన్నివేశానికి బేబీ దియ రవికంటి క్లాప్ కొట్టగా, సుమ రవికంటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. బేబీ మాయ రవికంటి తొలిషాట్‌కి దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా కుమార్ రవి కంటి మాట్లాడుతూ,’జూన్, జూలై, ఆగస్ట్‌లో ఏకధాటిగా సినిమా చిత్రీకరణ జరుపుతాం. అలాగే విదేశాలలో సాంగ్స్ షూట్ చేస్తాం. ఇది అద్భుతమైన సాంకేతిక విలువలు కలిగిన చిత్రం. ఇన్వెస్టిగేటీవ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది. అలాగే చక్కటి హాస్యం, హదయాన్ని హత్తుకునే భావోద్వేగాల కలయికగా ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది’ అని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా : జి.అమర్, మాటలు: భవాని ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ : అర్జున్ సూరిశెట్టి.
ప్రిన్స్ నయా సినిమా షురూ..
- Advertisement -
- Advertisement -