నవతెలంగాణ-హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్ కాలేజీ టోర్నమెంట్ క్రీడలు – క్రీడోత్సవాలు 2025–26లో సీతాఫల్మండి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి డి. నాగ వెంకటేశ్ అద్భుత ప్రతిభ కనబరిచారు.
మెన్స్ వెయిట్ లిఫ్టింగ్ విభాగం 94కేజీ బాడీవైట్‌లో మొత్తం 235 కేజీలు, కేటగిరీలో స్వర్ణ పతకంను సాధించి కళాశాలకు గౌరవం తీసుకువచ్చారు. కఠిన సాధన, నిబద్ధతతో ఈ విజయాన్ని సాధించిన నాగ వెంకటేశ్‌ను కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ. జి.బంగ్లా భారతీ అభినందించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ—
“మా కళాశాల విద్యార్థులు రాష్ట్ర, విశ్వవిద్యాలయ స్థాయిలో ఇలాంటి విజయాలు సాధించడం గర్వకారణం. నాగ వెంకటేశ్ వంటి ప్రతిభాశాలి విద్యార్థులకు కళాశాల ఎల్లప్పుడూ ప్రోత్సాహం అందిస్తుంది,” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, వైస్ ప్రిన్సిపాల్ NG కృష్ణమూర్తి, డా. జైపాల్, డా. రాజు, రాఘవేంద్ర, రజిని, డా. కిషోర్, డా. సైదులు, ఐమాన్, ప్రత్యుష, కృష్ణవేణి, చందన, స్వప్న, ఇఫ్రాన బేగం, ఈశ్వరి, వినోద్, ఇన్నారెడ్డి, శిల్ప,శారీరక విద్య విభాగం సిబ్బంది రామకృష్ణ, ఆయనను అభినందిస్తూ భవిష్యత్ క్రీడా ప్రయాణంలో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.




