Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతను ఇవ్వాలి 

పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతను ఇవ్వాలి 

- Advertisement -
  • – జయరాజ్ మండల పరిషత్ స్పెషల్ ఆఫీసర్ 
  • నవతెలంగాణ-గోవిందరావుపేట
  • ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని మండల స్పెషల్ ఆఫీసర్ జయరాజ్ అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయం లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటి ప్రాముఖ్యతను చాటుకున్నారు. అనంతరం జయరాజు మాట్లాడుతూ రోజురోజుకు పెరిగిపోతున్న విపరీత కాలుష్యం వారి నుండి మానవాళి మనుగడకు ప్రమాదం పొంచి ఉందని దీని నుండి సంరక్షణ పొందుటకు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. తరువాత ఎంపీ ఓ మమత మొక్కలు నాటి మాట్లాడారు. ఈరోజు పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని, ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకుని, ప్రతి ఒక్కరు  మీ ఇంటి ఆవరణలో చెట్టు ను, నాటుకోవాలని, ఆరోగ్యకరమైన జీవితానికి, పచ్చటి పర్యావరణం  ఎంతో దోహదపడుతుందని, ప్రతి ఒక్కరూ చెట్లు నాటడం వల్ల, భావితరాల వారి భవిష్యత్తుకు బాటలు వేసిన వారు అవుతారని, తెలిపారు, ఈ కార్యక్రమంలో, మండల విద్యాధికారి, దివాకర్, నీటిపారుదల శాఖ  డి ఈ  శ్రీనివాస్, కార్యాలయ సూపర్డెంట్ సాయి దుర్గ ,  పంచాయతీ కార్యదర్శులు, భారతి ఉస్మాన్  జూనియర్ అసిస్టెంట్ ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img