- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఆముదం గింజల నుంచి అత్యంత ప్రమాదకర విషం (రైసిన్) తయారు చేసి అమాయకుల ప్రాణాలు తీయాలని చూసిన ఉగ్రవాది అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ పై జైలులో దాడి జరిగింది. అహ్మద్ ను యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించిన విషయం విదితమే. ప్రస్తుతం అతడు గుజరాత్ లోని సబర్మతి జైలులో హైసెక్యూరిటీ బ్యారక్ లో ఉన్నాడు. అయితే, ఏం జరిగిందనే విషయంపై పూర్తి సమాచారం లేనప్పటికీ అహ్మద్ పై తోటి ఖైదీలు దాడి చేసి తీవ్రంగా కొట్టారని తెలుస్తోంది. ఈ ఘటనపై దర్యప్తు జరుపుతున్నామని, ఖైదీలు ఎందుకు దాడి చేశారనే విషయంపై ఆరా తీస్తున్నట్లు జైలు అధికారులు తెలిపారు.
- Advertisement -



