Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeఆటలుముంబయికి పృథ్వీ షా గుడ్‌బై

ముంబయికి పృథ్వీ షా గుడ్‌బై

- Advertisement -

– మరో రాష్ట్రానికి ఆడేందుకు ఎన్‌ఓసీ
ముంబయి:
యువ క్రికెటర్‌ పృథ్వీ షా (25) ఈ ఏడాది దేశవాళీ సీజన్‌లో ముంబయికి దూరం కానున్నాడు. పేలవ ఫామ్‌లో ఉన్న పృథ్వీ షాపై ఫిట్‌నెస్‌ కారణాలతో సెలక్టర్లు పక్కనపెట్టిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌18 వేలంలో సైతం అమ్ముడుపోని పృథ్వీ షా ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌ నుంచి ఎన్‌ఓసీ (నిరభ్యంతర పత్రం) తీసుకున్నాడు. ఈ విషయాన్ని ఎంసీఏ కార్యదర్శి అభరు ధృవీకరించారు. ‘పృథ్వీ షా ఎంతో ప్రతిభావంతుడైన క్రికెటర్‌. ముంబయి క్రికెట్‌కు చెప్పుకోదగిన ప్రదర్శన చేశాడు. అతడి నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం. భవిష్యత్‌లో రాణించాలని కోరుకుంటున్నామని’ అభరు తెలిపాడు. పృథ్వీ షా ఏ రాష్ట్రం తరఫున ఆడేది ఇంకా తెలియాల్సి ఉంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad