నవతెలంగాణ-హైదరాబాద్: వెనిజులా చమురు నిల్వలపై కన్నెసిన యూఎస్ ప్రెసిడెంట్.. జనవరి 3న ఆ దేశాధ్యక్షుడు మదురోతో పాటు ఆయన భార్యను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తూతూమంత్రంగా విచారణ జరిపి జైలులో నిర్భందించింది. ఈ ఘటన తర్వాత వెనిజులాలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉపాధ్యక్షురాలు డెల్సి రోడ్రిగ్జ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. తాజాగా డెల్సీ చమురు రంగంలోకి ప్రయివేటు సంస్థలకు అనుమతిస్తూ రూపొందించిన చట్టంపై ఆమె గురువారం సంతకం చేశారు. వెనిజులా సహజ వనరులు ఇప్పటిదాకా ప్రభుత్వ నియంత్రణలోనే ఉన్నాయి. కానీ అధ్యక్షురాలి డెల్సీ ఈ కొత్త చట్టంతో విదేశీ పెట్టుబడుల కోసం చమురు రంగంలోకి ప్రయివేటు సంస్థలకు ద్వారాలు తెరిచారు.
కాగా, కొత్తగా తెచ్చిన ఈ చట్టం పార్లమెంటులో ఆమోదంచిన రెండు గంటల తర్వాత అధ్యక్షురాలు రోడ్రిగ్జ్ సంతకం చేశారు. దేశ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు.



