Saturday, February 7, 2026
E-PAPER
Homeక్రైమ్ప్రయివేటు ట్రావల్స్‌ బస్సు దగ్ధం.. 39 మంది ప్రయాణికులు..!

ప్రయివేటు ట్రావల్స్‌ బస్సు దగ్ధం.. 39 మంది ప్రయాణికులు..!

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ – విజయవాడ హైవేపై ఈ రోజు తెల్లవారుజామున ఒక ప్రయివేటు ట్రావెల్స్ బస్సులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో బస్సు మంటల్లో పూర్తిగా కాలిబూడిదైంది. డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులందరూ ప్రాణాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాల్లోకి వేలితే.. హైదరాబాద్ నుంచి విజయవాడ వెలుతున్న ప్రయివేటు ట్రావెల్స్ బస్సు కంచికచర్ల మండల కేసర టోల్‌గేట్ సమీపంలోకి రాగానే బస్సు వెనుక భాగంలోని ఇంజిన్ నుంచి ఒక్కసారిగా పొగలు రావడాన్ని డ్రైవర్ గమనించారు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపివేసి, ప్రయాణికులను తక్షణమే కిందకు దిగిపోవాలని కేకలు వేశారు. దీంతో ప్రయాణికులందరూ దిగిన కొద్ది నిమిషాల్లోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించి పూర్తిగా అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు స్పాట్ చేరకున్నారు. ఫైర్ ఇంజన్ల సాయంతో మొదట మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో బస్సులో 39 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -