- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లాలో ప్రయివేటు ట్రావెల్స్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ముంబై నుంచి హైదరాబాద్ వస్తుండగా కోహిర్ మండలం కవేలీ చౌరస్తా వద్ద అదుపుతప్పింది. పొగమంచు కారణంగా దారి కనిపించకపోవడంతో రోడ్డు పక్కకు దూసుకెళ్లింది.
ఈ క్రమంలోనే అదుపుతప్పిన బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 31 మంది ప్రయాణిస్తున్నారు. వారంతా స్వల్ప గాయాలతో బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు
- Advertisement -



