Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంమోడీ స‌ర్కార్‌పై ప్రియాంక‌ గాంధీ ప్ర‌శ్నల వ‌ర్షం

మోడీ స‌ర్కార్‌పై ప్రియాంక‌ గాంధీ ప్ర‌శ్నల వ‌ర్షం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఉగ్రవాదుల్ని తుది ముట్టించామని అమిత్ షా చెబుతున్నారని.. అసలు పహల్గామ్ ఉగ్ర దాడి నిఘా వైఫల్యం కాదా? అని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, ఎంపీ ప్రియాంకాగాంధీ నిలదీశారు. పహల్గామ్‌లో భద్రతా సిబ్బందిని ఎందుకు లేరని ప్రశ్నించారు. టీఆర్ఎఫ్ అనేది కొత్తగా రాలేదని… కాశ్మీర్‌లో చాలా చోట్ల ఆ ఉగ్ర సంస్థ దాడి చేసిందన్నారు. 2024లో టీఆర్ఎఫ్ దాడుల్లో 9 మంది చనిపోయారని తెలిపారు. అయినా ఉగ్ర సంస్థ వరుస దాడులు చేస్తుంటే కేంద్రం ఏం చేస్తోంది? అని అడిగారు. పహల్గామ్‌ ఉగ్రదాడి ఘటనకు బాధ్యత ఎవరిది?, హోంమంత్రి లేదా ఐబీ చీఫ్‌ ఎవరైనా రాజీనామా చేశారా? అని ప్రియాంక గాంధీ నిలదీశారు.

కాశ్మీర్‌లో శాంతి నెలకొంది.. భూములు కొనుక్కోవాలని మోడీ చెప్పారని.. ఎక్కడుందని వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చ సందర్బంగా ప్రియాంకా గాంధీ లోక్‌సభలో మాట్లాడారు. అధికారపక్ష నేతలు వివిధ అంశాలపై మాట్లాడారని.. కానీ పహల్గామ్ ఉగ్రదాడి ఎందుకు, ఎలా జరిగిందో మాత్రం చెప్పలేదని విమర్శలు గుప్పించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad